Prakash Vemula

 ఇంగ్లీష్ నేర్చుకునే రాచమార్గం

englishజీవితంలో ఎదగాలన్న తపనతో, ఇంగ్లిష్ నేర్చుకోవాలన్న సంకల్పంతో ఎక్కడెక్కడో తిరుగుతాం. ఏమేమో చదువుతాం కానీ ఇంగ్లిష్ నేర్చుకునే రాచమార్గమేమిటో తెలుసా? మాట్లాడటం. 
అదీ విన్నది మాట్లాడటం. అంటే ముందు వినడం (Listening) ఆపై మాట్లాడటం. ఈ ప్రక్రియ మూడు దశలుగా జరుగుతుంది. 


వాటిని విపులంగా తెలుసుకుందాం.
ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందన్న మాట అక్షర సత్యం. ప్రతి మార్పుకు ఐడియానే మూలం. చెట్టునుండి కింద పడుతున్న ఆపిల్ న్యూటన్ మదిలో ఒక ఐడియాకు ప్రాణం పోసింది. తెలుగులాగా ఇంగ్లిష్ ఎందుకు నేర్చుకోలేమన్న ఐడియా ఇంగ్లిష్ పట్ల మనకున్న భయాన్ని పటా పంచలు చేస్తుంది. మన కళ్ళ ముందే గ్రామరు తెలియని చిన్న పిల్లలు అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడుతుంటే, మనమెందుకు మాట్లాడ లేమన్న ఐడియా గళం విప్పమంటుంది. తెలుగు చదవటం రాని పొరుగు రాష్ట్రాల వారు స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంటే, ఇన్నేళ్ళు చదివిన ఇంగ్లిష్ మనమెందుకు మాట్లాడలేమన్న ఐడియా అడుగు ముందు కేయ మంటుంది. అన్నిటికీ మించి ‘‘మాట్లా డితే మాట్లాడటం వస్తుందన్న ’’ ఐడియా మనచే ధారాళంగా ఇంగ్లిష్ మాట్లాడిస్తుంది.

ఇంగ్లిష్ పట్ల మన దృక్పథం మారితే, ఆలోచనలు మారతాయి. ఆలోచనలు మారితే, నమ్మకాలు మార తాయి. నమ్మకాలు మారితే చేసే పనులు మారతాయి. చేసే పనులు మారితే, వచ్చే ఫలితాలు కూడా మారతాయి. మెరుగైన ఫలితాలు రావాలంటే, సానుకూల దృకధం కావాల్సిందే. ఇంగ్లిష్ కష్టమనే పాత నమ్మకాల స్థానంలో, తెలుగులాగే ఇంగ్లిష్ నేర్చుకోవచ్చనే కొత్త నమ్మకాలను ఏర్పర్చుకోవాలి. ఒక అంశం పట్ల ఇలాంటి సానుకూల మార్పును Postive Paradigm Shift అంటాం. అంటే ఒక విషయం పట్ల మనకు గతంలో గల అభిప్రాయం, నమ్మకంలో సమూల మార్పు అని అర్థం.
భావ వ్యక్తీకరణ కాంక్ష పుట్టకతోనే వస్తుంది. మాటలు రాని వయస్సులో కూడా శరీర భాషద్వారా పిల్లలు తమ భావాలను వ్యక్తం చేస్తారు. వయస్సు పెరిగే కొద్ది చుట్టూ జరిగే సంభాషణలు వింటూ, అర్థం చేసుకుంటూ, తిరిగీ తిరగని నాలుకతో కసరత్తులు చేస్తూ, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. తొలిపలుకులు అందించే స్ఫూర్తితో, పరిసరాలే పాఠాలుగా ఐదారేళ్ళ వయస్సులోపే మాతృభాష ధారాళంగా మాట్లాడే స్థాయికి చేరుకుంటారు. తరవాతి క్రమంలో చదవటం, రాయటం నేర్చు కొని భాషా పరిజ్ఞానం తో పాటు మరింత వాగ్థాటి పెంచుకుంటారు. దేశం ఏదైనా, భాష ఏదైనా పుట్టిన ప్రతి బిడ్డ మాతృభాష ఇలానే నేర్చుకుంటుంది. 

మాతృభాష నేర్చుకునే తీరు (LSRW)
LSRW భాషలు నేర్పే రాచమార్గం. ఈ మార్గంలో గ్రామరు ప్రమేయం కానీ, అవసరం కానీ ఎక్కడా కనపడదు. విన్న మాటలను రిపీట్ చేయటమే మాట్లాడటంలో మొదటి అడుగు. చుట్టూ ఉన్న వారిని అనుకరిస్తూ మాటలు నేర్చుకుంటాం. కనుక ఏ ప్రాంతంలో పెరిగితే, మాటల్లో ఆ శైలి అబ్బుతుంది. అందుకే మనమంతా తెలుగు వారమైనప్పటికీ, ప్రాంతీయ భాషా ప్రభావంతో విభిన్న శైలిలో మాట్లాడతాం.
భాష సహజంగా నేర్చుకోవటం మూలంగా గ్రామరు పరిజ్ఞానం దానంతటదే వస్తుంది. అందుకే తెలుగు గ్రామరు తెలియకున్నా, తప్పులు లేకుండా మాట్లాడతాం, రాస్తాం. చిన్న ఉదాహరణలతో ఈ విషయాన్ని రూఢీ చేసుకుందాం.
కర్త క్రియ
నేను వచ్చాను
వారు వచ్చారు
అతడు వచ్చాడు
ఆమె వచ్చినది
నీవు వచ్చావు
మేము వచ్చాం
ఈ వాక్యాలను చూస్తే, తెలుగు చాలా కఠిన భాషగా భావించక తప్పదు. కారణం కర్త మారినప్పుడల్లా క్రియారూపం మారింది. తెలుగు రాని వారు పై మాటలను గ్రామరుతో నేర్చుకునే ప్రయత్నం చేస్తే, వారి జీవిత కాలంలో తెలుగు నేర్చుకోలేరు. గ్రామరు ద్వారా తెలుగు నేర్చుకో వటం కూడా అంతే కష్టం. ఈ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే, అంత త్వరగా గ్రామరుపై భ్రమలు తొలగి పోతాయి. లేదంటే మనల్ని నీడలా వెంటాడి నోరు తెరువ కుండా చేస్తుంది. ఇవే మాటల్ని ఇంగ్లిషులో కూడా చూద్దాం.


Subject Verb
I Came
They Came
He Came
She Came
you Came
We Came
ఈ వాక్యాలలో సబ్జెక్టు మారినా వెర్బ్ రూపం మారలేదు. ఈ ఉదాహరణలు చూస్తే తెలుగుకన్నా ఇంగ్లిష్ సులభమని చెప్పక తప్పదు. కష్టమైనా తెలుగు భాషను సులభంగా నేర్చుకున్న మనం, ఇంగ్లిష్ నేర్చుకోవటంలో ఎందుకు విఫలం అవుతున్నామో మరింత వివరంగా చూద్దాం.

listeingఇంగ్లిష్ నేర్చుకుంటున్న తీరు
ప్రస్తుతం సాగుతున్న మన విద్యా విధానంలో ఇంగ్లీష్ అకడమిక్ భాషగా నేర్చుకుంటున్నాం. క్లాస్ రూంలో కొద్దో గొప్పో ఇంగ్లిష్ వినే అవకాశం వున్నా కేవ లం విష య గ్రహ ణ కోసమే వింటున్నాం. ఒక ప్రత్యేక అవసరం కోసం వినడాన్ని సెలక్టివ్ లిజనింగ్ అంటాం. దీని ద్వారా భాష రాదు. విషయ గ్రహణ మాత్రమే జరుగు తుంది.

ఏ ప్రాంతంలో నివసిస్తే, ఆ ప్రాంత భాష అప్రయత్నంగానే నేర్చుకుంటాం. కొద్ది నెలలు కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తే కన్నడం వస్తుంది. కేరళలో నివసిస్తే మళయాళం వస్తుంది. అలాగే ఇంగ్లిష్ మాట్లాడే దేశా ల్లో నివసిస్తే ఇంగ్లిష్ వస్తుంది. కానీ మన ప్రాంతంలో ఉంటూ స్వయం కృషితో ఇంగ్లిష్ ఎలా నేర్చుకోవచ్చో చూద్ధాం. మనకు ఇంగ్లిష్ బాగానే తెలుసు. కానీ తెలియటం అంటే మాట్లాడటం కాదు. తెలియడం మెదడుకు సంబంధించింది. మాట్లాడటం నాలుకకు సంబంధించింది. ఈ రెండింటిని అనుసంధానం చేస్తేనే నోరు పెగులుతుంది. ఆ మాటే మంత్రంగా పని చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇంగ్లిష్ నేర్చుకునేందుకు MSC చిట్కాను పాటిం చండి.

selectiveM - Mind Talk : సారవంతైమైన నేలలో విత్తనం ఎలా మొక్కగా మారి మానవుతుందో, మనసులో మాటల్ని మననం చేసుకుంటే, ఏదైనా విషయాన్ని ఇట్టే చెప్పేయొచ్చు, మనం గతంలో చేసిన పనులు, భవిష్యత్తులో చేయబోయే పనులు, ఇతరులతో చెప్పాలనుకునే విషయాలు, మన బలాలు, బలహీనతలు ఇలా వేటినైనా ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో మననం చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా Mind talk లో నిమగ్నం కావచ్చు. దీని వల్ల ఇంగ్లిష్ పట్ల మీ అంతర్గత సామర్థ్యం పెరుగుతుంది. ఓవర్ హెడ్ ట్యాంకుతో నీళ్ళు వుంటే గదా నల్లా ద్వారా నీళ్ళు వచ్చేది. విషయాన్ని ఎలా చెప్పాలో తెలిస్తే గదా చెప్పగలిగేది. ఇందుకై సరైన ఉపాయం మైండ్ టాక్.

S - Self Talk : మనసులో ఉన్న భాషకు నాలుక తోడైతేనే మాట పలుకుతుంది. చాలా సందర్భాలలో ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలుస్తుంది. కానీ చెప్పలేం, కారణం మాట్లాడే అలవాటు లేకపోవడమే. వాడే కొద్ది పదునెక్కేది ఒక్క నాలుక మాత్రమే నని ఒక మేధావి మాట్లాడే అవసరాన్ని గుర్తు చేశాడు. అంతగా రాని భాషలో మొదటగా ఇతరులతో మాట్లాడటం కష్టమే. అందుకే మనతో మనమే మాట్లాడుకోవాలి. దీనినే Self Talk అంటాం. ఇతరులతో మాట్లాడిన అనుభవమే దీని ద్వారా కలుగుతుంది. మీకు మీరే క్రిటిక్. అవసరమైతే మాట్లాడే తీరుకు మెరుగులు దిద్దుకోవచ్చు. దీనితో ఇతరులతో మాట్లాడ గలమన్న ఆత్మ విశ్వాసం వస్తుంది.
C - Cross Talk : మైండ్ టాక్, సెల్ఫ్‌టాక్ ద్వారా ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలుస్తుంది. మాట్లాడే అనుభవం కూడా వస్తుంది. కాకపోతే గ్రామర్ భయంతో ఇతరులతో మాట్లాడేందుకు జంకుతాం. పలుసార్లు మాట్లాడితే, మాట్లాడటం అలవాటుగా మారుతుంది. కాల క్రమంలో తెలుగు ఎలా మాట్లాడుతామో, ఇంగ్లిష్ కూడా అలాగే మాట్లాడే స్థాయికి చేరుకుంటాం. నేర్చుకోవటంలో మీ చిత్తశుద్ధిని బట్టి ఫలితాలు వస్తాయి.

చివరగా ఒక్కమాట. ఇంగ్లిష్ జీవితానికి అవస రంగా భావించండి. ఇంగ్లిష్‌ను ఇష్టపడండి. ఇంగ్లిష్ పద బంధాలు (ఎక్స్‌ప్రెషన్స్) నేర్చుకోండి. మైండ్ టాక్, సెల్ఫ్‌టాక్, క్రాస్‌టాక్‌లో విరివిగా వాడండి. ఇంగ్లిష్ వింటున్నా, చదువుతున్నా విషయ గ్రాహణలతో పాటు భాష కూడా నేర్చుకోండి. అతి తక్కువ కాలంలో ఇంగ్లిష్ నేర్చుకునేందుకు మాట్లాడటం కంటే మంచి మార్గం లేదు. మాట్లాడేందుకు ఆల్ ది బెస్ట్.

గ్రామర్ లేకుండా ఇంగ్లిష్
ఇంగ్లిష్ నేర్చుకోవాలంటే మనకున్న ఏకైకమార్గం గ్రామర్ నేర్చుకోవడమే. కర్త, కర్మ, క్రియ వేర్వేరు సందర్భాలలో వీటిని ఉపయోగించే విధానాన్ని సాంప్రదాయ బద్ధంగా నేర్చుకొని ఆపై ఇంగ్లిష్ మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలి. దీనితో ‘ఇది మన వల్ల అయ్యే పని కాదని’ నిసృ ్పహ చెందుతున్న వారికి ఓదార్పు కల్గించి గ్రామర్‌తో సంబంధం లేకుండా సరళంగా, సులభంగా తెలుగు నేర్చుకున్నట్లే అప్రయత్నంగా ఇంగ్లిష్ నేర్పే వినూత్న విధానం. ఇంగ్లిష్ మాట్లాడాలనుకునే యువతను ప్రతివారం ఉత్సాహపరుస్తూ... మాట్లాడేందుకు కావలసిన ఆత్మ విశ్వాసాన్ని కల్గించే శీర్షిక.

గతవారం తెలుసుకున్నది !
-గ్రామర్ అవసరం లేకుండా ఇతరులు మాట్లాడేది వినడం ద్వారా మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు.
-అయితే సంభాషణకు సంబంధించిన కొన్ని మౌలిక అంశాలపై అవగాహన అవసరం. Conversation Starters - Good Morning, Hello, Hi వంటివి అలాగే Conversation Fillers - you know, you see, like, but వంటివి తెలుసుకొని ఉండాలి.
-అలాగే Conversation Expressions - How are you, what is the time? వంటివి వాడవచ్చు.
-సంభాషణలో స్వరం హెచ్చు తగ్గులు, శరీర భాష కూడా ప్రాధాన్యం వహిస్తాయి. వీటి ద్వారా 90% భావాన్ని వ్యక్తం చేయవచ్చు.

ఈ వారం నేర్చుకున్నవిషయాలు !
-గ్రామరు ద్వారా ఏ భాషనైనా నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఫలితం వెంటనే రాదు.
-విన్న మాటలను రిపీట్ చేయడమే మాట్లాడటంలో మొదటి అడుగు.
-తెలుగు మాట్లాడకుండా ముందు వ్యాకరణం నేర్చుకొని తద్వారా మాట్లాడాలనుకుంటే ఎప్పటికీ తెలుగులో మాట్లాడలేరు.
వ్యాసకర్త ః రచయిత, శిక్షకులు.